Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. అన్ని పార్టీలో గెలుపు వ్యూహాలపై దూకుడు పెంచుతున్నాయి. మరోవైపు పార్టీ మధ్య యుద్ధవాతావరణం కనిపిస్తోంది. ఏపీలో రాజకీయ సెగ ఢిల్లీని కూడా తాకింది. ఈ నేపథయంలో చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే అని.. కచ్చితంగా ముందస్తు ఎన్నికలు వస్తాయని మరోసారి స్పష్టం చేశారు.
ముందుగా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్లలో పత్తి రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై వివరాలు తెలుసుకున్నారు. వర్షాలకు పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టంపై లెక్కలు సేకరించడానికి రాలేదని వివరించారు. పెట్టుబడి పూర్తిగా నష్టపోయామని కన్నీరు పెట్టుకున్న రైతులను చంద్రబాబు ఓదార్చారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉత్తుత్తి బటన్ నొక్కడం తప్ప రైతుల గోడు గురించి పట్టదు అధికార పార్టీకి పట్టదని మండిపడ్డారు. పంటలు లేక.. పండిన పంటలు నీట మునిగిన కారణంగా.. రైతన్నలు కన్నీరు పెడుతుంటే.. తాడేపల్లిలో నిద్రపోయే సీఎం మనకు ఉండడం దౌర్భాగ్యం అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దించాలన్నారు. పల్నాడు జిల్లా తిమ్మాపురం, నాదెండ్ల మండలాల పరిధిలో చంద్రబాబు పర్యటించారు. ఆ మండలాల పరిధిలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పత్తి, మిరప పంటలను పరిశీలించారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోకుండా వైసీపీ సర్కార్ నిద్రపోతోంది అన్నారు. తిమ్మాపూర్, నాదెండ్ల మండలాల్లో దెబ్బతిన్న పంటచేలు పరిశీలించి.. పంటనష్టంపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గతేడాది తామర పురుగుతో మిర్చి పంట పాడైందని.. ఈసారి పత్తి వేస్తే వర్షాలు దెబ్బతీశాయని చంద్రబాబు వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయామని వాపోయారు.
తాజాగా అకాల వర్షాలతో పంటలు కుళ్లిపోయాయని రైతులకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లిందని చంద్రబాబు అన్నారు. రైతులకు ఇబ్బంది కలిగితే క్షేత్రస్థాయిలో వారికి అండగా ఉండాల్సిన సీఎం.. తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోతున్నారని విమర్శించారు. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని.. ఆయన పొట్ట అబద్ధాల పుట్ట అని వ్యాఖ్యానించారు.