Chandrababu: ఏపీలో జీవో 1 ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం టూర్ పై ఆంక్షలతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన నేడు రెండో రోజు ప్రజలను కలిసే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టడంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అలాగే తాజా కుప్పం పర్యటనపై నెల రోజుల ముందే డీజీపీకి లేఖ రాసినట్లు చంద్రబాబు చెప్పారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తన నియోజకవర్గ ప్రజలతో తాను మట్లాడవద్దా అంటూ ప్రభుత్వాన్ని, పోలీసుల్ని నిలదీశారు. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. పుంగనూరు పుడంగి పెద్దిరెడ్డి గుర్తు పెట్టుకోవాలి. పుంగనూరులో నీ కథ తేలుస్తా.. అంటూ వార్నింగ్ ఇచ్చారు.