ముఖ్యంగా నేతలు చెప్పినట్టు పోలీసులు వ్యవహరిస్తుండడం దారుణమన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు, అయ్యన పాత్రుడు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుకి వారికి భారత రత్న ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు.. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాపాడుకోవడనికి టీడీపీ కార్యకర్తలు సైన్యంలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
అయితే కొందరి కార్యకర్తల తీరుపై మండిపడ్డారు. పదవుల కోసం ఎవరూ పాకులాడకూడదని హితవుపలికారు.. కార్యకర్తలకు సొంత ఎజెండాలు వద్దు అని హెచ్చరించారు.. ఏం చేయాలి.. ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై తాను మాత్రమే నిర్ణయం తీసుకుంటాను అన్నారు. కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తరువాతే అభ్యర్థి ఎంపిక ఉంటుంది అన్నారు.
ఇక, రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు.. దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న నారాయణ విద్యా సంస్థల మీద కేసులపై కేసులు పెట్టారని విమర్శించారు.. 2014లో గెలిపించారు.. పోలవరం ప్రాజెక్ట్ నేను నాటిన మొక్క.. నా ప్రాణం పోలవరం.. 28 సార్లు పోలవరం వెళ్లా.. 82 సార్లు సమీక్షలు చేశా.. 72 శాతం పనులు పూర్తి చేశాం.. దేని కోసం.. మన రైతుల కోసం.. దూరదృష్టితో పనిచేశా.. కానీ, ఇప్పుడు నేను పోలవరం వెళ్తే అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పట్లో తాను గట్టిగా పట్టుపట్టడంతోనే ఆర్డినెన్స్‌తో ఆ పని పూర్తిఅయ్యిందన్నారు.. అది అంతా రాష్ట్ర ప్రజలపై ఉన్న ప్రేమతోనే చేశానని తెలిపారు చంద్రబాబు.. మరోవైపు, ఇదే నాకు చివరి ఎన్నిక అంటున్నారు.. సైకో పాలన భూస్థాపితం చేసేవరకు ఉంటా.. రాష్ట్రాన్ని బాగు చేసేవరకు ఉంటానని వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు..