Vijayasai Meets Sajjala: వైసీపీలో నెంబర్ టు ఎవరు అని చర్చ జోరుగా సాగుతోంది. మొన్నటి వరకు సజ్జలే నెంబర్ టూ అని అంతా అనుకున్నా.. అనూహ్యంగా విజయసాయి రెడ్డి కూడా రేసులోకి వచ్చారు. కేవలం ఉత్తరాంధ్రకు.. విశాఖ జిల్లాకు మాత్రమే పరిమితం అనుకున్న ఆయనకు.. ఊహించని విధంగా ప్రమోషన్ దక్కింది. సజ్జలతో పాటు సమాన పదవులు దక్కాయి..
వైసీపీ (YCP) అంటే వన్ మెన్ షో అని ప్రత్యేకంగా చెప్పాల చెప్పాలి. ఎందుకంటే అధినేత జగన్ (Jagan) ఏది చెబితే అదే ఫైనల్.. ఆ తరువాత స్థానం ఎవరిది అన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నెంబర్ 2 ఎవరు అని తెలిస్తే.. వారికే తమ సమస్యలు చెప్పుకుంటే బెటర్ అనే ఆలోచనలో పార్టీ నేతలు, కేడర్ ఉంటారు. ఇప్పుడు వారి చూపు విజయసాయిపై పడుతోంది.
కేబినెట్ లో లేకపోయినా ప్రస్తుతం జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటోంది. పాలన పరమైన వ్యవహరాల్లో నిర్ణయం తీసుకున్న వారిలో ముందున్నది సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) మొన్నటి వరకు ఆయనే పార్టీలో నెంబర్ టూ అనే ప్రచారం ఉంది. సీఎం కు ఏ చెప్పాలి అన్నా ముందు సజ్జల దర్శన చేసుకోవాల్సిందే అనే టాక్ ఉండేది.. ఇప్పుడు అకస్మాత్తుగా విజయసాయిరెడ్డి రేసులోకి వచ్చారు.
పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ వెంట ఉన్నవిజయసాయిరెడ్డికి.. రాజ్యసభ సీటు ఇచ్చి.. కేవలం ఉత్తరాంధ్రకు సరిపెట్టడంపై.. పార్టీలోనే రకరకాలుగా చర్చ సాగింది. ఆయన్ను పక్కన పెట్టారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇన్నాళ్లకు.. అంటే అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు.. విజయసాయిరెడ్డిని పార్టీలో కీలకం చేశారు జగన్. కొద్ది రోజుల క్రితమే.. పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పజెప్పారు. ఇప్పుడు కొత్తగా.. పార్టీ జిల్లా అధ్యక్షులకు.. కోఆర్డినేటర్గానూ నియమించారు.
ఇలా ప్రమోషన్ ఇచ్చారని ఉత్సాహమా..? లేక తనే ఇక నెంబర్ టూ అని నమ్మకం వచ్చిందో.. వేరే కారణం ఏమైనా ఉందో.. కానీ ఎప్పుడూ లేనిది తొలిసారి కొత్త లుక్ లు దర్శనమిచ్చారు. ఆయన గుండు లుక్ లో కనిపించారు. ఇలా గుండు చేయించుకున్న లుక్కులో విజయసాయిరెడ్డి ఇప్పటిదాకా ఎప్పుడూ కనిపించలేదు. ఈ లుక్కులో విజయసాయిరెడ్డి ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మరోవైపు ఎవరూ ఊహించని విధంగా విజయసాయి రెడ్డి నేరుగా.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. ఇలా ఆయన ఇంటికి వెళ్లడం కూడా తొలిసారి కావడంతో ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీలో కీలక నేతలుగా గుర్తింపు పొందిన ఈ ఇద్దరూ కీలక అంశాలపై చర్చలు జరుపుతున్నారు. అందుకే ఈ ఇద్దరి మధ్య ఏం చర్చ జరిగిందంటూ మాట్లాడుకుంటున్నారు.
ఎన్నికలకు సమయం ఉన్నా.. పార్టీని బలోపేతంపై ఫోకస్ చేస్తున్నారు. ఇటీవల మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. ఇప్పుడు పార్టీ వ్యవహారాలపై డిస్కస్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. 10వ తేదీ నుంచి గడప గడపకి కార్యక్రమంపై పార్టీ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరు మీట్ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీని మరింత బలోపేతం చేయడంపై వారి చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం.