రెండో టర్మ్ లో కూడా తొలి నుంచి ఆమె పరిశీలనలో లేదంటూ ప్రచారం జరిగింది. మరోసారి ఆమె నిరాశ తప్పదని అనుచరులు కూడా ఢీలా పడ్డారు. అంతేకాదు. అదే జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి, నారాయణ స్వామిని కొనసాగించడంతో రోజాకు పదవి లేనట్టే అన్నారు. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో ఆమెకు మంత్రి పదవి ఖరారు చేశారు సీఎం జగన్.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత.. క్రీడాకారులకు పూర్తి ప్రోత్సాహం అందిస్తామన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాలు కల్పిస్తామని మంత్రి రోజా చెప్పారు. ఆర్టిస్ట్‌గా కళాకారుల సమస్యలు తమకు తెలుసన్నారు. కళాకారులకు మంచి చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని రోజా తెలిపారు. ఆ తరువాత గండికోట టూ బెంగళూర్, బెంగళూరు టూ గండికోట బస్ సర్వీస్‌ను ప్రారంభిస్తూ తొలిసంతకం చేసినట్టు రోజా వెల్లడించారు.