Minister Roja: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ తరువాత కొంతమంది మంత్రులు తీవ్రంగా నిరసన తెలుపుతున్నారు. ఒకరిద్దరు ఇప్పటి వరకు ఆ శాఖ బాధ్యతలు కూడా తీసుకోలేదు.. తమ శాఖలకు సంబంధించి రివ్యూలకు హారజరయ్యేందుకు కూడా ఇష్టపడడం లేదు. మంత్రి రోజా మాత్రం అందుకు భిన్నం.. ప్రాధాన్యత లేని శాఖే అయినా.. ఆమె మాత్రం ఉత్సహంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ఆర్ కె రోజా బిజీ అయిపోయారు. వివిధ అధికారిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆమె పర్యటించారు. అక్కడ బాస్కెట్ బాల్ పోటీలను ప్రారంభించారు. కేవలం పోటీలను ప్రారంభించడమే కాదు.. కాసేపు సరదగా అక్కడి విద్యార్థులతో కలిసి బాస్కెట్ బాల్ ఆడారు.
ఒకరు ఇచ్చే రక్తం మరొకరి ప్రాణం నిలుపుతుంది. రక్తం ఇవ్వటంతో పాటు అవయవదానం చెయ్యాలి. కోవిడ్ సమయంలో రక్తం నిల్వలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు నడిపేది యువతే అని నమ్మిన వ్యక్తి సీఎం జగన్. యువతకు ఆయన అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారని రోజా అన్నారు.