Minster RK Roja Phone Missing: సాధారణంగా ఈ రోజుల్లో ముబై ఫోన్లకు రక్షణ లేకుండా పోతోంది. ఫోన్ లో ఎన్ని సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టినా.. ఎక్కడో ఒకచోట మొబైల్ దొంగతనాలు జరుగుతునే ఉంటాయి. అయితే ఈ సారి ఏకం మంత్రి ఫోన్ మిస్ అవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. మంత్రి ఫోన్ కే దిక్కులేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏంటి అని అంతా ప్రశ్నిస్తున్నారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తన నియోజకవర్గానికి వచ్చిన ఆమె.. ఇవాళ తిరుపతిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. తాజాగా ఎస్వీ యూనివర్సిటీ సెట్ హాల్ లో నిర్వహించిన శ్యాప్ సమావేశంలో మంత్రి రోజా పాల్గొన్నారు. ఆ సమావేశంలో ఆమె మాట్లాడుతున్న సందర్భంలో ఆమె ఫోన్ అక్కడే ఉంది..
వెంటనే ఆమె సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించారు. సెల్ ఫోన్ ఎవరు దొంగిలించారో తెలియడం లేదు. ప్రస్తుతం ఆ సెల్ ఫోన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఏకంగా మూడు పోలీసు టీంలను ఏర్పాటు చేశారు. పద్మావతి గెస్ట్ హౌస్ తో పాటు ఎస్వీ యూనివర్సిటీలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మంత్రి ఫోన్ పోవడమే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది. మంత్రి ఫోన్ కే దిక్కులేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజుల్లో మొబైల్ పోతే.. త్వరగానే దొరికే టెక్నాలిజీ ఉంది. క్షణాల్లో సిగ్నల్స్... ఇతర క్లూస్ ద్వారా ఎక్కడ ఉంది అన్నది తెలుసుకోవచ్చు.. మరి రోజా ఫోన్ ను పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకుంటారో లేదో చూడాలి.