ఎన్నో అవమానాలు, అవహేళనలు, అడ్డంకులను పట్టుదల, క్రమశిక్షణతో అధిగమించి తెలంగాణ సాగిస్తున్న ప్రస్థానాన్ని ప్రపంచమే అబ్బురంగా చూస్తుందన్నారు మంత్రి కేటీఆర్. 2014 లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఎన్నారైలకు వివరించారు మంత్రి కేటీఆర్.ఈ విజయగాథలో భాగం పంచుకోవాలని ఎన్నారైలను కోరారాయన.
మరోవైపు మంత్రి కేటీఆర్ కు తెలంగాణలోనే కాదు.. ఇతర ప్రదేశాల్లోనూ అభిమానులు పెరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ మంత్రి కేటీఆర్ కు అభిమానులు భారీగానే ఉన్నారు. తాజాగా కేటీఆర్ సీఎం కావాలంటూ ఏపీలోని ఓ అభిమాని బైక్ యాత్ర చేపట్టాడు. గుంటూరు జిల్లాకు చెందిన బాలరాజుగౌడ్ అనే వ్యక్తి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ గుంటూరు జిల్లా మాచర్ల నుంచి యాదాద్రి వరకు బైక్ యాత్రకు శ్రీకారం చుట్టాడు.
తన బైక్ యాత్ర గురించి తాను తమ స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని బాలరాజుగౌడ్ చెప్పారు. తన యాత్రకు ఎమ్మెల్యే పిన్నెల్లి పర్మిషన్ కూడా ఇచ్చారని తెలిపాడు. కేటీఆర్ సీఎం కావాలని యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తనకు కేటీఆర్ విధానలు నచ్చుతాయని.. అందుకే తన అభిమాన నేత సీఎం కావాలని కోరుకుంటున్నట్లు వివరించారు.