Ap: చంద్రబాబు సైకో..లోకేష్ ఐరన్ లెగ్..పాదయాత్రపై మంత్రి రోజా సెటైర్లు
Ap: చంద్రబాబు సైకో..లోకేష్ ఐరన్ లెగ్..పాదయాత్రపై మంత్రి రోజా సెటైర్లు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ పై వైసీపీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు సైకో..లోకేష్ ఐరన్ లెగ్ అని రోజా విమర్శించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ పై వైసీపీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు సైకో..లోకేష్ ఐరన్ లెగ్ అని రోజా విమర్శించారు.
2/ 7
లోకేష్ యువగళం పాదయాత్రలో తొలిరోజే పదాలు పలకరాక తడబడ్డాడని..అతను లోకేష్ కాదు పులకేష్ అంటూ ఎద్దేవా చేశారు. తన తండ్రిని అభిమానించే వారి కష్టాలు తీర్చేందుకు సీఎం జగన్ పాదయాత్ర చేపట్టారన్నారు.
3/ 7
ఇక అధికారంలోకి వచ్చాక 98 శాతం హామీలు సీఎం జగన్ అమలు చేశారని రోజా అన్నారు. నేడు విశాఖ శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న అనంతరం రోజా మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు.
4/ 7
లోకేష్ మొదటి సారి గోదావరి పుష్కరాలకు వచ్చినప్పుడు 29 మందిని పొట్టన బెట్టుకున్నాడు. ఇక ఆ తరువాత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు లోకేష్ తండ్రి చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో నోటీసులు వచ్చాయి.
5/ 7
మొన్న పాదయాత్ర పోస్టర్ లాంచ్ చేసినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. ఇక నిన్న పాదయాత్ర మొదలు పెట్టిన తొలిరోజే తారకరత్నకు గుండెపోటు వచ్చింది.
6/ 7
కానీ తారకరత్నను చంద్రబాబు, లోకేష్ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. ఇలాంటి ఐరన్ లెగ్ రాష్ట్రమంతా నడిస్తే మా పరిస్థితి ఏంటని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు.
7/ 7
ఇక వారిని దేవుడే కాపాడాలి. అలాగే నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని రోజా ఆకాంక్షించారు. సీఎం జగన్ పాలనలో మహిళలకు భద్రత పెరిగింది. యువకులకు ఉద్యోగాలు కూడా వచ్చాయన్నారు.