Minister Roja: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ కనిపిస్తోంది.. అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు గెలుపే లక్ష్యంగా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అధికార వైసీపీ అయితే.. గడప గడపకు ప్రభుత్వం పేరుతో నిత్యం ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. కొంతమంది వైసీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని లైట్ తీసుకుంటే.. మంత్రి రోజా మాత్రం వర్షం లోనూ తగ్గేదే లే అంటున్నారు.
గడప గడపకు ప్రభుత్వాన్ని వైసీపీ చాలా సీరీయస్ తీసుకుంది. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. గడప గడపకు ప్రభుత్వంలో ఎమ్మెల్యే ప్రోగ్రస్ ఆధారంగానే సీట్లు ఉంటాయని.. లేని వారికి సీటు ఉండదని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజా ఇలా వర్షంలోనే కార్యక్రమం చేపట్టారు.
సంక్షేమ పథకాల వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది అన్నారు. అధికారులను కాకుండా నేతలను నేరుగా ప్రజల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అన్నారు. ఇలా చేయడం ద్వారా ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడమే తమ లక్ష్యమన్నారు.
మంత్రి రోజా పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం సచివాలయం పరిధిలోని ఇళ్లకు వెళ్లారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పరమేశ్వర మంగళం, వడ్డి ఇండ్లు గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వారికి ప్రభుత్వం మంజూరు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది అన్నారు. గడప గడపకు ప్రభుత్వలో ఆ స్పందన కనిపిస్తోందన్నారు. ప్రతిపక్షాలకు ఓటు వేసిన సానుభూతి పరులకు సైతం పథకాలు అందుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో వారంతా జగన్ వెంటే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు..