Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. దుర్గమ్మ దర్శనం అనంతరం అమ్మవారి సన్నిధిలో తన ప్రచార వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. అటుపై ఏపీలో తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తారు.
జనసేనాధినేత పవన్ కల్యాణ్ ప్రచారానికి సంబంధించిన అన్నీ ఏర్పాట్లు చురుగ్గా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం ఆయన ప్రచార రథం వారాహికి కొండగట్టు ఆంజనేయస్వామి గుడిలో వాహనానికి తొలి పూజ చేయించారు. (File Photo)
2/ 8
ఇప్పుడు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. దుర్గమ్మ దర్శనం అనంతరం అమ్మవారి సన్నిధిలో తన ప్రచార వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. (File Photo)
3/ 8
తలపెట్టిన కార్యం దిగ్విజయంగా కొనసాగాలని..తన ప్రచారానికి అమ్మవారి అభయం ఉండాలని కోరుతూ జనసేనాని ప్రత్యేక పూజలు చేయనున్నారు. పవన్ కల్యాణ్ దుర్గమ్మ దర్శనం తర్వాత రెండ్రోజుల పాటు విజయవాడలోనే బస చేయనున్నారు.(File Photo)
4/ 8
రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే విధంగా తాను చేపట్టబోయే ప్రచారానికి సంబంధించిన రూట్ మ్యాప్, ఏర్పాట్లపై పార్టీ శ్రేణులతో చర్చిస్తారు. (File Photo)
5/ 8
ధర్మపురిలో నరసింహయాత్ర చేపట్టిన పవన్ కల్యాణ్ ..ఇటు ఏపీలో అటు తెలంగాణలో పార్టీ భవిష్యత్ ప్రణాళిక, పొత్తులకు అనుగూణంగానే అడుగులు వేయనున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో చేరికలు కూడా ఊపందుకోనున్నట్లుగా తెలుస్తోంది. (File Photo)
6/ 8
జనసేనాలోకి గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత, ఏపీ మాజీ బీజేపీ చీఫ్ కన్నా చేరిక కూడా ఇదే సమయంలో ఉండటంతో జనసేనాధినేత పవన్ కల్యాణ్ రెండ్రోజుల పాటు విజయవాడలో బిజీ బిజీగా గడపనున్నారు. (File Photo)
7/ 8
ఉమ్మడి గుంటూరు జిల్లాలతో పాటు విజయవాడలో కూడా కొందరు బీజేపీ నేతలు ఇతర పార్టీల నాయకులు జనసేనాలో చేరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ రెండ్రోజుల పాటు విజయవాడలో బస చేయనున్నట్లుగా సమాచారం ఉంది.(File Photo)
8/ 8
జనసేన ప్రెసిడెంట్ పవన్ కల్యాణ్ ప్రచారం ఓవైపు మొదలవుతుండగానే..మరోవైపు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కూడా మొదలవుతుండటంతో ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. మరోవైపు ఈ రెండు పార్టీలపై వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.(File Photo)