ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు.. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తరువాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ సైతం చాలా భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.