Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరశంఖం మోగినట్టే.. స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డే ఎన్నికల ఎప్పుడన్నదానిపై క్లారిటీ ఇచ్చేశారు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఎన్నికలకు కేవలం 19 నెలలే సమయం ఉంది. సో సమయం లేదు మిత్రమా అంటూ అన్ని పార్టీలు కథన రంగంలోకి దిగేందుకు సై అంటున్నాయి. ఇక జనసేన అధినేత సైతం బస్సు యాత్రకు సిద్ధమయ్యారు.
ఇక్కడే వాహనాలు రెడీ అవుతుండడంతో పవన్ ఎప్పటికప్పుడు స్వయంగా వెళ్లి వాటిని పరిశీలిస్తున్నారు. ఆయనే కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆయన సూచనల ప్రకారమే ప్రచార రథం సంసిద్ధమవుతున్నట్లు పార్టీ క్యాడెర్ చెప్తుంది. సినిమా క్యారీ వ్యాన్లా కాకుండా.. ప్యూర్ పొలిటికల్ మోడల్‌తో ప్రచార రథం రెడీ అవుతుందని చెప్తున్నారు.
ఈ వాహనానికి ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఇందులో కనీసం ఆరుగురు కూర్చుని చర్చించుకునేలా కన్వెట్టబుల్ సిట్టింగ్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు.. ఈ యాత్రపై కుట్రలు చేసే అవకాశం ఉండడం.. అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో.. నిఘా నేత్రం మధ్య వాహనం ఉంటుంది. అంటే చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి.
పవన్ యాత్ర రథాన్ని ప్రత్యేకంగా రూపొందిస్తుండడంతో దీనిని ఎప్పుడు చూస్తామా అనే ఆసక్తి పవన్ అభిమానుల్లోనూ, జనాల్లోనూ నెలకొంది. అయితే మొదట అక్టోబర్ 5 నుంచి ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని జనసేన అధినేత నిర్ణయించారు. విజయ దశమి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ సైతం ప్రకటన చేశారు.