[caption id="attachment_1266476" align="alignnone" width="1280"] సమాచార హక్కు చట్టం ద్వారా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల వివరాలను సేకరించిన జనసేన పార్టీ.. ఆ జాభితా ఆధారంగానే వారి కుటుంబాలకు ఆర్ధికసాయం అందిస్తున్నట్లు తెలిపింది. మొదటి విడతలో 80 మంది రైతులకు సాయం చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకోవడం లేదని.. పంటల దిగుబడి రాక.. అప్పుల పాలై.. ప్రభుత్వ ఆదుకోకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. అలాంటి రైతు కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల సమస్యలు పరిష్కరించి వారికి అండగా ఉంటామన్నారు.