గతంలో వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో.. విశాఖ ఎయిర్ పోర్టులో తనపై కత్తి దాడి జరిగింది అంటూ గగ్గోలు పెట్టారని.. అప్పుడు తాను కూడా ఖండించాను అన్నారు. అయితే ఆ రోజులు తనకు ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదని.. ఆంధ్రా వైద్యులపై నమ్మకం లేదని అన్నారని.. ఇప్పటికీ ఆయనకు ఏపీ లో ఉన్న అధికారులపై నమ్మకం లేదన్నారు. మరి మూడేళ్లు అవుతున్నా ఆ కేసును ఎందుకు తేల్చలేకపోతున్నారని ప్రశ్నించారు.
జనసేన అధికారంలోకి వస్తే.. ఏవో అద్భుతాలు జరిగిపోతాయని తాను చెప్పడం లేదు అన్నారు. కానీ వ్యవస్థలను పటిష్టం చేసి తీరుతామన్నారు. అధికారం మారినప్పుడల్లా కొత్త వ్యవస్థను తీసుకురావక్కర్లేదని.. ఉన్న వ్యవస్థతోనే అద్బుతాలు చేయొచ్చు అన్నారు. నిజాయతీ ఉన్న అధికారులు ఉన్నత స్థానాలో కూర్చొబెట్టి.. వారి స్వేచ్ఛ ఇవ్వాలి అన్నారు.
అయినా పార్టీ నడపడానికి ఇంకెవరికీ అర్హత లేదా అని ప్రశ్నించారు. అలాగే తనకు పదవే కావాలి అనుకుంటే ఎప్పుడో ఎంపీ అయ్యేవాణ్ని అని గుర్తు చేశారు. ఏదైనా రాజకీయంగా లబ్ధి కావాలి అంటే.. నేరుగా ప్రధాని అపాయింట్ మెంట్ తీసుకుని.. ఆయన్నుఅడిగే చనువు తనకు ఉంది అన్నారు. కానీ మీలా ప్రజల బలాన్ని.. ప్రేమను తాకట్టు పెట్టడం తనకు ఇష్టం లేదన్నారు పవన్..