GT Hemanth Kumar, Tirupathi, News18. MLA Roja: ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. మేకతోటి సుచరిత, పాముల పుష్ప శ్రీవాణి, తానేటి వనిత.. అయితే ఈ ముగ్గురు త్వరలోనే తమ పదవులకు రాజీనామా చేసి.. పార్టీ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దీనిపై వారికి సీఎం జగన్ నుంచి క్లారిటీ వచ్చినట్టు సమాచారం. దీంతో వారి స్థానంలో కొత్తగా ఎవరు మంత్రి పదవుల్లోకి వస్తారన్నదానిపై ఆసక్తి పెరిగింది. అయితే అందులో ఒకరు రోజా అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని.. అయితే ఎక్కువమందిని కేబినెట్ నుంచి తొలగించాల్సి వస్తుందని.. అయితే వారందరినీ జిల్లా ఇంఛార్జులుగా నియమిస్తామని.. ఎన్నికల కోసం కష్టపడాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నారని.. దీంతో కొంతమంది త్యాగం చేయక తప్పదని తేల్చి చెప్పేశారు. అందులోనూ కష్ట పడే వారికి.. ప్రజల్లో ఉండేవారికి పదవులు తప్పవనే సంకేతాలు ఇచ్చారు.. ఇది కూడా రోజాకు ప్లస్ అయ్యింది.