Balakrishna:హీరో.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. సినిమాల్లో ఎలా గర్జిస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇటీవల అంఖడతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.. అఘోరా పాత్రలో స్క్రీన్ పై గర్జించారు.. అయితే సినిమాల్లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ ఆయన పవర్ ఫుల్ డైలాగ్ లు పేలుస్తాంటారు.. తాజాగా మరోసారి ఆయన గర్జించారు.
ఈ సారి వైసీపీ శ్రీణులకు నేరుగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. ఇన్నాళ్లు ఓపిక పట్టాం.. ఇక ఊరుకొనేది లేదంటూ హెచ్చరించారు. రెండు రోజుల క్రితం కొత్తగా ఏర్పడ్డ శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కొడికొండలో జాతర జరిగింది. ఈ సమయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది.
మొదట కొడికొండకు చేరుకొని గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించారు. అయితే బాలయ్య రాక సందర్భంగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డంకులు కలిగించారంటూ.. టీడీపీ నేతలు ఆరోపించారు. పోలీసుల తీరుపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు.. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని.. మండిపడ్డారు.. కఠిన ఆంక్షల మధ్యే ఆయన కార్యకర్త ఇంటికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. వైసీపీ శ్రేణులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోబోమని అన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గ్రామాల్లో వైసీపీ నేతలు కక్షలు రేపుతున్నారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్న వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మండిపడ్డారు.