Good News: ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్ధులకు మరో శుభవార్త చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్యంగా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న ఆయన.. అత్యధికంగా విద్యా, వైద్య రంగాలపై ఫోకస్ చేస్తున్నారు. పేదలకు ఉన్నత విద్య, వైద్యం అందించాలన్నదే తమ లక్ష్యం అంటూ పదే పదే చెబుతున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (Cm Jaganmohan Reddy). విద్యా రంగంలో ఇప్పటికే అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు.
ఈ మేరకు పాఠశాల విద్యా విభాగం మిడ్ డే మీల్స్ డైరెక్టర్ ఉత్తర్వు లు జారీ చేశారు. విద్యార్థినీ, విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మెనూను పక్కాగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అన్ని పాఠశాలలకు.. దీనికి సంబంధించి గైడ్ లైన్స్ అమలు చేయాలని అన్ని స్కూళ్లకు ఉత్తర్వులు జారీ చేశారు.