Pawan Kalyan janavani: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ విధానాలపై జనసేన పోరాటం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకుని.. అవి ప్రభుత్వానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. జనవాని కార్యక్రమం పేరుతో జనసేన ఇచ్చిన పిలునకు అనూహ్య స్పందన వచ్చింది. వేల సంఖ్యలో జనం వచ్చి తమ సమస్యలను నేరుగా పవన్ కు చెప్పుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం నివాసం వద్ద భద్రత పేరుతో ఇల్లు ఖాళీ చేయించారని ఓ మహిళ తనను కలిసిందన్నారు. దీంతో అధికార పార్టీ నేతలు ఆ కుటుంబాన్ని ఎలా వేధించారో అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల సోదరుడు అనుమానాస్పద స్థితిలో మరనించాడని... కూరగాయల కోసం వెళ్లిన ఓ వ్యక్తి శవమయ్యాడని.. దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు.