గత రెండు రోజులుగా గ్రామీణ ఉపాధి హామీ కూలి గా పని చేస్తున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా మాస్కు పెట్టుకుని మరి ఆయన కూలీ పనులు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది లెఫ్ట్ పార్టీలు పార్లమెంట్లో గట్టిగా ఉద్యమించి సాధించుకున్న పథకమని, అప్పట్లో జాతీయ పార్టీలన్నీ కూడా ఈ పథకాన్ని తీసుకు రాకూడదు అని తీర్మానించాయి అని గుర్తుచేశారు.
ఉపాధి హామీ వల్ల ప్రతి ఏటా 50 వేల కోట్ల రూపాయల నష్టం ఏర్పడుతుందని అన్నిపార్టీలు వ్యతిరేకించాయని.. అయినా వామపక్ష పార్టీలు తప్పకుండా ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతోపాటు ఆకలి చావులను, నిరుద్యోగతను పారదొలేందుకు అవకాశం ఏర్పడిందన్నారు.
అప్పట్లో ఈ గ్రామీణ ఉపాధి ద్వారా కోట్లాది మంది గ్రామీణ నిరుద్యోగులు, మహిళలు లబ్ధి పొందారన్నారు. ముఖ్యంగా బాలింతలు ఈ పథకంలో వచ్చి పని చేసేటప్పుడు చిన్నపిల్లల కోసం ప్రత్యేక కిట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ లు, ఎండాకాలంలో మజ్జిగ సరఫరా చేసేవారని, కానీ ఇప్పుడు ఆ నిబంధనలు అన్నీ కాలరాసి కేవలం పనులు మాత్రం చేయించుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలా పూడిక తీసిన తరువాత ఆ మట్టిని ఒడ్డున కాకుండా కట్టమీద తీసుకుపోయి పోయడం వల్ల చెరువు కట్ట మరింత పటిష్టంగా మారుతుందని సలహా ఇచ్చారు. ఈ పథకంలో పనిచేసే వారికి కూలీలు అందిన వెంటనే సోషల్ ఆడిట్ ను నిర్వహిస్తే బాగుంటుందని, అలా కాకుండా రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చి చేయడం వల్ల పని జరగనట్లు ఫీల్డ్ అసిస్టెంట్లతో రికవరీ చేయడం సరికాదన్నారు.