Ysr Cheyutha: సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఈ నెల 22వ తేదీన 45 ఏళ్లు నిండిన మహిళలకు నగదు విడుదల చేయనున్నారు. అది కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అడ్డా నుంచి ఈ సంక్షేమ పథకాన్ని అందచేయనుంది. అయతే ఈ ఏడాది ఆగస్టు 12 నాటికి 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది ప్రభుత్వం.
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అదనపు సయయం కూడా పూరైంది. ఇప్పటికే సచివాలయానికి దరఖాస్లు చేరాయి.. ఇప్పటికే వాటి వెర్ఫికేషన్ కూడా ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం పేరుతో ఏటా 18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు అందజేస్తోంది.
దరఖాస్తులను పూర్తి చేసుందుకు 11వ తేదీ వరకు అవకాశం కల్పించారు. సో దీంతో ఇప్పటికే గడువు ముగిసింది. ఆ దరఖాస్తులను ఎంపీడీవోల ఆధ్వర్యంలో పరిశీలన పూర్తి చేసి అర్హులను గుర్తిస్తారు. ఇదిలా ఉండగా, కొత్తగా పేర్ల నమోదు ప్రక్రియకు కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఎవరైతే జత చేశారో వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించనున్నారు.