Unstoppable With NBK 2: చంద్రబాబు లైఫ్‌లో బిగ్ అలయన్స్ .. ఏంటో తెలుసా?
Unstoppable With NBK 2: చంద్రబాబు లైఫ్‌లో బిగ్ అలయన్స్ .. ఏంటో తెలుసా?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్‌లో కనిపించిన విషయం తెలిసిందే.ఈ ఎపిసోడ్ ఇవాళ స్ట్రీమింగ్ అయ్యింది. దీంతో ఈ షో వేదికగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన పర్సనల్ లైఫ్‌తో పాటు.. పొలిటికల్ లైఫ్ పై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్ షో భారీగా హిట్ అయింది. పలు రికార్డులని కూడా క్రియేట్ చేసింది. ఈ షోలో బాలయ్య బాబు సరికొత్తగా కనపడటంతో అభిమానులు ఫుల్ ఫిదా అయిపోయారు. ఈ షోకి సీజన్ 2ని కూడా ప్రకటించి గ్రాండ్ లాంచ్ చేశారు.
2/ 9
అన్‌స్టాపబుల్ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, తాజాగా నేడు ఆహాలో మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు.
3/ 9
ఫస్ట్ ఎపిసోడ్లో చంద్రబాబు, నారా లోకేష్ సందడి చేశారు. చంద్రబాబుకి బాలకృష్ణ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. షోలో ఎన్నో సరదా విషయాలు, రాజకీయాలు మాట్లాడారు. షోలో ఎన్టీఆర్ ని ఎప్పుడు మొదటిసారి కలిశారు అని బాలకృష్ణ అడిగారు.
4/ 9
ఈ సందర్భంగా చంద్రబాబును బాలయ్య మీ జీవితంలో బిగ్ అలయన్స్ ఏంటి అని ప్రశ్నించారు. దానికి చంద్రబాబు ఇచ్చిన సమాధానంతో బాలయ్య షాక్ అయ్యారు.
5/ 9
చంద్రబాబు .. తన జీవితంలో బెస్ట్ అలయన్స్ నా మ్యారేజ్ నా జీవితంలో బిగ్గెస్ట్ అలయన్స్ అదే అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు, భువనేశ్వరితో తన పెళ్లి పెద్ద అలయన్స్ అన్నారు. చంద్రబాబు భువనేశ్వరిని 1981 సెప్టెంబర్ 10న వివాహం చేసుకున్నారు. (ఫోటో)
6/ 9
చంద్రబాబు .. ఎన్టీఆర్ కుమార్తె, బాలయ్య సోదరి అయిన భువనేశ్వరిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అన్ స్టాపబుల్ షో వేదికగా చంద్రబాబు తన పెళ్లికి సంబంధించిన విషయాల్ని కూడా వెల్లడించారు.
7/ 9
పెళ్లయ్యాక హైదరాబాద్‌లో వెంగళరావు పార్కు దగ్గర కాపురం పెట్టానన్నారు. అక్కడ నాకు ఇబ్బందిగా ఉందనుకుని జూబ్లీహిల్స్‌లో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఉన్న ఇంటి స్ధలంలో నాకు ఇల్లు కట్టిస్తానని రామారావుగారు తనకు చెప్పారన్నారు. అయితే అప్పుడు ఎన్టీఆర్‌కు వద్దని చెప్పానన్నారు.
8/ 9
అంతేకాదు ఓ టాస్క్‌లో నారా భువనేశ్వరికి కాల్ చేశారు చంద్రబాబు. భువనేశ్వరిని తాను భువ అని పిలుస్తానన్నారు. ఆమెకు షోలో ఉండగానే.. కాల్ చేసి ఐ లక్ యూ చెప్పారు. అయితే బాలయ్య చంద్రబాబుకు ఐ లవ్ యూ అని చెప్పాలన్నారు.
9/ 9
ఐ లైక్ యూ లోనే లవ్ కూడా ఉంటుందన్నారు. ఇష్టం తర్వాత ప్రేమ ఉంటుందన్నారు చంద్రబాబు. దీంతో బాలయ్య మరేం అనలేకపోయారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.