Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మూడు రోజు కూడా భారీగా పోలీసులు మోహరించే ఉన్నారు.. మరి పవన్ ముందు అనుకున్న షెడ్యూల్ వరకు వైజాగ్ లోనే ఉంటారా.. లేక విశాఖను వీడి వెళ్తారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తాజా పరిణామాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీసినట్టు తెలుస్తోంది.
విశాఖ లో పవన్ కల్యాణ్ పర్యటన లో జరిగిన ఘటనల పై.. అమిత్ షా స్వయంగా ఆరా తీసినట్టు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది.. ఎందుకు పవన్ కు నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది..? అంటూ స్థానిక బీజేపీ నేతలతో కేంద్ర హోం శాఖ కార్యాలయం అధికారులు మాట్లాడినట్టు సమాచారం. ఇవాళ నేరుగా అమిత్ షా పవన్ తో మాట్లాడే అవకాశం ఉందంటున్నారు.
ప్రస్తుతం ఏ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేకుండా.. పోలీసులు మోహరించారు.. అందులోనే కార్యకర్తలు నేతను విడుదల చేసే వరకు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేని పవన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవాళ విశాఖలోనే ఉంటారా..? లేక.. హైదరాబాద్ వెళ్లిపోతారా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. అయితే జనసేన నేతలు చెబుతున్నదాన్ని బట్టి మధ్యాహ్నం 1.30 తరువాత పవన్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్తారని తెలుస్తోంది.
ఏ ఎఫ్ ఐ ఆర్ లోనైనా కొంతమంది నిందితుల పేర్లు పేర్కొన్నప్పుడు.. దాని పక్కనే ప్లస్ అదర్స్ అని ఉంటుంది.. అంటే ఎంతమందినైనా ఇంక్లూడ్ చేసేందుకు సౌలభ్యం ఉంటుంది. అందుకే ఈ సంఖ్య 76 తో ఆగదు ఇంకా చాలా పేర్లు ఉంటాయని జనసేన లీగల్ సెల్ అంచనా వేస్తోంది. అయితే వారందరినీ విడిచిపెట్టే వారకు పవన్ అక్కడే ఉంటారని మరో ప్రచారం కూడా ఉంది.
విశాఖపట్నం జిల్లాకు చెందిన 9 కుటుంబాలకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెండు, విజయనగరం జిల్లాకు చెందిన ఓ కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్ధిక సాయం చేశారు. ఈ సందర్భంగా క్రియాశీలక సభ్యుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబాలకు జనసేన పార్టీ భవిష్యత్తులోనూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.