2023 జనవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను రేపు విడుదల చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు.. ఈ ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో మాత్రమే విడుదల చేయనుంది. ఈ విషయాన్ని భక్తులు గమనించి ఆన్ లైన్ లో టికెట్లు పొందేందుకు సిద్ధంగా ఉండాలని టీటీడీ సూచించింది.
అయితే ఈ టోకెన్లను కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. ఇతర వెబ్ సైట్లు లేద దళారులను ఎట్టిపరిస్థితుల్లో నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సరిగ్గా ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు.. దానిపై క్లిక్ చేసి.. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది..
మరోవైపు డిసెంబర్ 16, అలాగే 31వ తేదీల్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల ఆన్లైన్ కోటాను.. మంగళవారం అంటే డిసెంబర్ 13న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్సైట్లో విడుదల చేయనుంది. ఈ విషయాన్ని కూడా భక్తులు గుర్తుంచుకోవాలని టీటీడీ కోరింది.. ప్రత్యేక దర్శనం కావాలి అనుకున్నవారు.. గుర్తుంచుకోవాలి అన్నారు.
ఆ లింక్ ను క్లిక్ చేస్తే అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. అక్కడి నుంచి లాగిన్ పేజికి వెళ్తుంది. లాగిన్ కాగానే ఏఏ తేదీలు అందుబాటులో ఉన్నాయో చూపిస్తూ డ్యాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు కావాల్సిన తేదీని, స్లాట్ ను చెక్ చూసుకోవాలి. అందులో ఖాళీలు ఉంటే గ్రీన్ కలర్ చూపిస్తుంది.. ఎన్ని ఖాళీలున్నాయో చూపిస్తుంది.