Women Minsters: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఎన్నికల ముందు.. సీఎం అయిన తరువాత స్వామి స్వరూపానంద స్వామి (Swaroopanad swamy)ని కలిశారు. ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. తాను సీఎం కావడంతో స్వామిజీ దీవెనులు కూడా ఉన్నాయని జగన్ నమ్మారు.. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు తాజా మంత్రులు.. మొన్న రోజ.. నేడు విడుదల రజనీ సైతం స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
స్వామి ఆశీర్వాదాలు తీసుకున్న వెంటనే ఆమె.. విశాఖ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా పని ప్రారంభించారు. జిల్లాలో ఉన్న చిన్న చిన్న గ్రూపు విబేధాలపై ఆమె ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అంతా సర్దుకుపోవాలని.. ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే.. తనతో చెప్పొచ్చని.. 24 గంటలు అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చినట్టు సమాచారం.