ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా (Minister RK Roja).. మంత్రిగా దూసకుపోతున్నారు. ఇప్పటికే టూరిజం అభివృద్ధి కోసం జిల్లాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేశామన్న ఆమె.. ప్రముఖ టూరిస్ట్ స్పాట్లకు స్వయంగా వెళ్తూ వాటికి ప్రచారం కల్పించే పనిలో పడ్డారు. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడలో పలు పర్యాటక ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు రోజా.