ఆచార్య సినిమా రిలీజ్ రోజే రోజా.. చిరంజీవి ఇంటికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. తాజా భేటీలో ఇద్దరి మధ్య సినిమాలపైనా చర్చజరిగినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగుల కోసం ఏపీలోని టూరిజం స్పాట్లను వినియోగించుకోవాలని.. అందుకు సంబంధించిన పర్మిషన్స్ కూడా తన శాఖ నుంచి ఇప్పిస్తానని రోజా హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.