YS Jagan-KTR: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇద్దరు మంచి మిత్రులు.. గతంలో పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరు ఆప్యాయత చూపించారు కూడా.. కానీ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో మౌలిక వసతులపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సరైన రోడ్లు లేవు. విద్యుత్ కోతలు వేధిస్తున్నాయని తన ఫ్రెండ్ చెప్పాడంటూ వ్యాఖ్యానించారు. దీంతో అప్పటి నుంచి టీఆర్ఎస్, వైసీపీ మధ్య రాజకీయ దుమారం రేగింది. తరువాత కేటీఆర్ తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకున్నా వివాదం ఆగలేదు. ఆ ఇష్యూ తరువాత తొలిసారి సీఎం జగన్-తెలంగాణ మంత్రి కేటీఆర్ లు ఒకేవేదికపై కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ను జగన్ ఏమన్నారంటే.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్లో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండో రోజు ఆయన పలు కీలక సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పలు సంస్థలతో చర్చించారు. అదే సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం దావోస్ లోనూ ఉన్నారు. ఇద్దరు తమ రాష్ట్రాలకు పెట్టుపెడ్డుబులు రప్పించేలా చేయడంలో బిజిబిజీగా ఉన్నారు.
దావోస్ ఆర్థిక సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- అదానీ గ్రూప్ మధ్య ఏకంగా రూ.60వేల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. కాలుష్య రహిత ఇంధనం ఉత్పత్తే లక్ష్యంగా ఏపీలో రెండు మెగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఇందులో ఒకటి 3,700 మెగావాట్లు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టు కాగా రెండోది 10 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టు.
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు సైతం పెట్టుబడులు వెల్లువెత్తాయి. కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధుల బృందం మొత్తంగా 600 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు సాధించింది. లూలు గ్రూప్స్ అధినేత యూసుఫ్ అలీ తెలంగాణలో 500 కోట్ల పెట్టుబడులతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పగా, స్పెయిన్కు చెందిన బహుళ జాతి కంపెనీ కీమో ఫార్మా కూడా 100 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్లో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని ప్రకటించింది.