Breaking News: శుభవార్త..ఖాతాల్లోకి 'వైఎస్సార్ ఆసరా' నిధులు జమ చేసిన సీఎం జగన్
Breaking News: శుభవార్త..ఖాతాల్లోకి 'వైఎస్సార్ ఆసరా' నిధులు జమ చేసిన సీఎం జగన్
YSR Aasara: ఏపీ పొదుపు సంఘాలు దేశానికే రోల్ మోడల్ గా నిలిచాయని సీఎం జగన్ పేర్కొన్నారు. పొదుపు సంఘాల్లో వచ్చిన ఈ విప్లవం అందరికి ఆదర్శంగా నిలిచాయని సీఎం అన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ ఆసరా మూడో విడత నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు.
ఏపీ పొదుపు సంఘాలు దేశానికే రోల్ మోడల్ గా నిలిచాయని సీఎం జగన్ పేర్కొన్నారు. పొదుపు సంఘాల్లో వచ్చిన ఈ విప్లవం అందరికి ఆదర్శంగా నిలిచాయని సీఎం అన్నారు. సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
2/ 10
2016 అక్టోబర్ లో నిలిచిపోయిన సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొచ్చామని..ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని సీఎం స్పష్టం చేశారు.
3/ 10
ప్రతీ ఇంటికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కూడా ఆస్తిని అప్పగించాం. మహిళలు దైర్యంగా ఉండడానికి 'దిశను' కూడా తీసుకొచ్చామన్నారు.
4/ 10
ఏలూరు జిల్లా దెందులూరులో వైయస్సార్ ఆసరా మూడో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.
5/ 10
రూ.6,419.89 కోట్లను మహిళల ఖాతాల్లో నగదు జమ చేయగా..ఏప్రిల్ 5 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
6/ 10
కాగా ఇప్పటివరకూ ఆసరా కింద రూ.19,178 కోట్లు ప్రభుత్వం మహిళల ఖాతాల్లో జమ చేసిందని సీఎం జగన్ అన్నారు.
7/ 10
చంద్రబాబు హయాంలో సున్నా వడ్డీని నిలిపివేస్తే..మనం అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని మళ్లీ తీసుకొచ్చామన్నారు.
8/ 10
అలాగే ఎంపిటిసిలు, జడ్పీటీసీలు సహా ఇతర పదవుల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని సీఎం పేర్కొన్నారు.
9/ 10
ఈరోజు నుంచి మొదలు పెడితే ఏప్రిల్ 5 వరకు అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ నగదు పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది.
10/ 10
మూడో విడత కింద 78.94 లక్షల మంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.6419 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో రోజు వారిగా జమ చేయనున్నారు.