AP Politics: ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. కేవలం ఏడాదిన్నరే సమయం ఉండడంతో అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలపై ఫోకస్ చేస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తు దిశగా ఇప్పటికే అడుగులు పడ్డాయి. ఇటు సీఎం జగన్ మోహన్ రెడ్డి.. 175 అసెంబ్లీ స్థానాల్లో నెగ్గడమే టార్గెట్ గా.. నేతలకు దిశా నిర్దేశం చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు వివిధ మార్గాల్లో సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఎక్కడ అయితే నేతలు వీక్ గా ఉన్నారు అనిపిస్తే అక్కడ.. సిట్టింగ్ లతో నేరుగా మాట్లాడుతూ..? ప్రోగ్రస్ రిపోర్ట్ పెంచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే పరిస్థితి అలానే ఉంటే.. అభ్యర్థలను మార్చేందుకు కూడా వెనకాడేది లేదని.. వార్నింగ్ ఇస్తున్నారు. అధినేత ధైర్యంగా 175 సీట్లు గెలుస్తామని చెబుతున్నా..? కొందరు మంత్రుల్లో.. మాజీ మంత్రుల్లో టెన్షన్ తగ్గడం లేదు అంటున్నారు. ముఖ్యంగా జనసేన-టీడీపీ పొత్తు రూపంలో డేంజర్ సిగ్సల్స్ అందుతున్నాయి అంటున్నారు.. ఆ రెండు పార్టీలు పొత్తుతే ఈ నేతలకు ఏంటి టెన్షన్.. అలా భయపడుతున్న మంత్రులు.. మాజీ మంత్రులు ఎవరు..?
గత ఎన్నికల్లో వైసీపీ గాలికి చాలా చోట్ల ప్రత్యర్థి పార్టీలు నిలబడలేకపోయాయి.. వైసీపీ 151 సీట్లలో ఘన విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేన విడి విడిగా పోటీ చేశాయి. దీంతో తెలుగు దేశం పార్టీకి భారీగా డ్యామేజ్ అయ్యింది. రాష్ట్రా వ్యాప్తంగా సుమారు 35కు పైగా నియోజకవర్గాల్లో వైసీపీ ఆరు, ఏడు వేల లోపు మెజార్టీతోనే నెగ్గింది.. ఆ నియోజకవర్గాల్లో జనసేనకు అంతకంటే ఎక్కువే ఓట్లు వచ్చాయి..
ఆ లిస్టులో ఉన్నదవి వీరే.. ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాద రావుపై జనసేన టీడీపీ పొత్తు ప్రభావం పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి దర్శా న ప్రసాదరావు గత ఎన్నికల్లో ఆయన 84 వేల 84 ఓట్లు సాధించారు. ఇక్కడ టీడీపీకి 78 వేల 307 ఓట్లు రాగా.. జనసేన 7 వేల557 ఓట్లు వచ్చాయి.. అంటే కేవలం 5 వేల 777 ఓట్ల మార్జిన్ తో గెలుపొందారు. జనసేనకు వచ్చిన ఓట్లు కంటే ధర్మాన మెజార్టీ తక్కువే..
మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు.. భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన 1 లక్ష.. వేయి 629 ఓట్లు సాధించారు. అయితే అక్కడ టీడీపీ గత ఎన్నికల్లో 91 వేల 917 ఓట్లు సాధించింది.. ఇక జనసన అయితే 24 వేల 248 ఓట్లు సాధించింది. ఇప్పుడు జనసేన అభ్యర్థి పంచకర్ల సందీప్ స్థానికంగా మంచి పట్టు సాధించారు. గతంలో పోల్చుకుంటే ఆయన ఇమేజ్ కూడా పెరిగింది. గత ఎన్నికల్లో అవంతి ఆధిక్యం 9 వేల 917 ఓట్లు మాత్రమే..?
అత్యధికంగా మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు ఇబ్బందులు తప్పవని ఆయన అనుచరులే లెక్కలు వేసుకుంటున్నారు. అనకాపల్లి నుంచి అమర్ నాథ్ 73 వేల 207 ఓట్లు సాధించారు. అక్కడ టీడీపీకి 65 వేల 038 ఓట్లు.. జనసేనకు 12 వేల 988 ఓట్లు వచ్చాయి. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే.. అమర్ నాథ్ కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చినట్టే. ఈ సారి జనసైనికులు అనకాపల్లిలో చాలా కసిగా ఉన్నారు.
మరో మాజీ మంత్రి కురసా కన్నబాబుది అదే పరిస్థితి అంటున్నారు. కాకినాడ రూరల్ లో కాపు ఓట్లు ఎక్కువగా ఉంటాయి. అవి జనసేనకు అడ్వాంటేజ్ కానుంది. గత ఎన్నికల్లో కన్నబాబు కు 74 వేల 068 ఓట్లు వచ్చాయి. టీడీపీ 65 వేల 279 ఓట్లు సాధించారు. ఇక జనసేన 40 వేల 001 ఓట్లు సాధించింది. ఆ రెండు పార్టీలు కలిసిపోటిస్తే కన్నబాబు.. భారీగా ఓటమి పాలయ్యేవారు.. మరి ఈ సారి అదే ఓట్లు ఆ రెండు పార్టీలు సాధిస్తే పరిస్థితి ఏంటని కన్నబాబు వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.
పెడన నుంచి మంత్రి జోగి రమేష్ పరిస్థితి కూడా అదే.. గత ఎన్నికల్లో జోగి రమేష్ కు 61 వేల 920 ఓట్లు వచ్చాయి. అక్కడ తెలుగు దేశం పార్టీకి 54 వేల 081 ఓట్లు.. జనసేనకు 25 వేల 733 ఓట్లు వచ్చాయి. జోగి రమేష్ కవలం 7 వేల 839 ఓట్ల మెజార్టీతో మాత్రమే నెగ్గారు. ఇప్పుడు జనసేన, టీడీపీ కలిస్తే.. జోగి రమేష్ కు కష్టాలు తప్పకపోవచ్చనే ఆందోళన ఉంది. అందులోనూ ప్రభుత్వం వ్యతిరేకతకు తోడు. జోగి రమేష్ పై వ్యతిరేకత.. అలాగే అక్కడ ఉన్న వైసీపీ గ్రూపుల నుంచి కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
మాజీ మంత్రి పేర్నీనానికి కూడా టెన్షన్ వెంటాడుతోందనే ప్రచారం ఉంది. మచిలీపట్నం నుంచి గత ఎన్నికల్లో పేర్ని నానికి 66 వేల 141 ఓట్లు వచ్చాయి. ఇక అక్కడ టీడీపీ 60 వేల 290 ఓట్లు సాధించగా..? జనసేనకు 18 వేల 807 ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే పేర్ని నానికి ఇబ్బందులు తప్పవు అంటున్నారు. ఎందుకంటే ఆయనకు వచ్చింది.. కేవలం 5 వేల 932 మాత్రమే.. అందులోనే ఈ సారి ఆయన తప్పుకుని తన కొడుకుని ఎన్నికల్లో నిలబెట్టాలని నాని అనుకుంటున్నారు.. కానీ అధినేత జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అందుకే జనసేన, టీడీపీ కలిస్తే పేర్ని నానికి ఇబ్బందులు ఎదుర్కోవాలనే ప్రచారం ఉంది.
మాజీ మంత్రి అనిల్ కుమార్ ది అదే పరిస్థితి. నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ గత ఎన్నికల్లో 75 వేల 040 ఓట్లు దక్కించుకున్నారు. అక్కడ టీడీపీకి 73 వేల 052 ఓట్లు రాగా.. జనసేనకు 5 వేల 503 ఓట్లు వచ్చాయి. అనిల్ మెజార్టీ కేవలం1988 మాత్రమే.. అయితే గత ఎన్నికల్లో టీడీపీ తరపున మాజీ మంత్రి నారాయణ పోటీలో ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన యాక్టివ్ గా లేరు. నారాయణ కాకుండా ఆ స్థానంలో వేరెవరైనా పోటీ చేస్తే అంత ప్రభావం చూపుతారా లేదా అన్నది చూడాలి. అయితే నెల్లూరు జిల్లాలో వర్గ పోరు కూడా అనిల్ కు మైనస్ అయ్యే ప్రమాదం ఉంది.
మంత్రి రోజా కూడా ఈ జాబితాలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో ఆమె నెగ్గినా స్వల ఓట్ల తేడాతోనే గెలుపొందారు. గతంతో పోల్చుకుంటే ఆమె పై వ్యతిరేకత పెరిగింది. అలాగే సొంత పార్టీలోనూ ఆమెను వ్యతిరేకంగా వర్గం కూడా బలంగానే ఉంది. చాలామంది కీలక నేతలు ఆమెకు వ్యతిరేకంగానే పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమెకు 80 వేల 333 ఓట్లు రాగా.. టీడీపీకి 77 వేల 665 ఓట్లు.. జనసేన బలపరిచిన అభ్యర్థికి 3 వేల 44 ఓట్లు వచ్చాయి. ఆమె మెజార్టీ కేవలం 2 వేల 708 మాత్రమే.. మరి ఈ సారి జనసేన టీడీపీ కలిస్తే రోజా పరిస్థితి ఏంటి అన్నది చూడాలి.