Vidadala Rajani: ఆంధ్రప్రదేశ్ లో చాలామంది మంత్రులు ఉన్నా.. విడదల రజనీది ప్రత్యేక గుర్తింపు.. అందుకే తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన ఆమె.. జగన్ రెండో కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనతి కాలంలోనే అత్యంత గుర్తింపు తెచ్చుకున్నారు. సీఎం జగన్ కు నమ్మదగ్గ నేతగా మారారు.. అందుకే ఆమె ఏం చేసినా వార్తల్లోనే ఉంటుంది.
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఆమె.. తాజాగా కాసేపు స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. వెల్లూరు గ్రామంలో స్కూల్ రెన్నువేషన్ పనుల్లో భాగంగా.. పునాది రాయి వెళ్లడానికి వెళ్లిన ఆమె.. అక్కడ విద్యార్థులను చూసి.. క్లాస్ లో అడుగుపెట్టారు. కాసేపు టీచర్ లా పాఠం బోధించి.. స్కూల్ లో అందుకున్న సౌకర్యాలు.. వారి చదువు ఎలా సాగుతుంది తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు.
కోవిడ్ నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని రజని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత కోవిడ్ టీకాను ప్రారంభిస్తున్నట్లు మంత్రి రజినీ పేర్కొన్నారు.18 ఏళ్లు నిండి ఇప్పటికే రెండు డోసులు కోవిడ్ టీకా తీసుకున్న ప్రతి ఒక్కరూ మూడో విడత ప్రికాషన్ టీకా డోసును తీసుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలలు,అర్బన్ హెల్త్ సెంటర్లు,కమ్యూనిటీ సెంటర్లు,ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలు,కోవిడ్ పంపిణీ కేంద్రాలలో కోవిడ్ టీకాను ప్రతి సోమవారం,ప్రతి శుక్రవారం ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బలమైన సచివాలయ వ్యవస్థ,వైద్య ఆరోగ్య సిబ్బంది పనిచేస్తుండడం వల్ల మిగతా రాష్ట్రాల కంటే కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ లో ముందు వరసలో ఉన్నామన్నారు.