Minister Roja: వైసీపీ ఫైర్ బ్రాండ్.. మంత్రి రోజా.. మళ్లీ ఫుల్ ఫాంలో ఉన్నారు. తనదైన స్టైల్లో విపక్షాలపై పంచ్ డైలాగ్ లు పేలుస్తున్నారు. తాజాగా అల్లూరి సీతరామరాజు.. కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం మొత్తాన్ని ఆమె దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రధాని మోదీ బహిరంగ సభ ముగిసిన తరువాత మంత్రి రోజా వేదిక పైనే సెల్ఫీ సందడి చేసారు.
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం జగన్నాథపురంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించారు ఆమె. ఈ సందర్భంగా మాట్లాడిన రోజా.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం అయ్యిందని.. భీమవరం కార్యక్రమం విజయవంతం కావడంతో భీమ్లానాయక్ గారు బిగుసుకుపోయారు.. చంద్రబాబు నీరుగారిపోయారు అంటూ సెటైర్లు వేశారు రోజా..
ఈ కార్యక్రమానికి రావాలని పిలిచినా టైం లేక రాలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అంటున్నారు.. మన్యం వీరుడికి పవన్ ఇచ్చిన విలువ ఎలాంటిదో దీన్ని బట్టి అర్ధం అవుతుందని వ్యాఖ్యానించారు.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మన్యం వీరుడి విగ్రహ ఆవిష్కరణలో భాగం కానివాళ్లు దురదృష్టవంతులు అని కామెంట్ చేశారు మంత్రి ఆర్కే రోజా.