Ammvodi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి పథకం అత్యంత ముఖ్యమైనది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏటా 15 వేల రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే రెండేళ్ల పాటు లక్షలాది మందికి ఈ పథకాన్ని అందించిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే ఎన్పీసీఐ మ్యాప్ అయిన ఖాతాలో మాత్రమే నగదు పడుతుంది. బ్యాంకుకి వెళ్లి ఎంపీటీసీ మ్యాప్ చేసుకోల్సి ఉంటుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో తల్లి, విద్యార్థి ఓకే మ్యాపింగ్‌లో ఉండాలి. వివరాలు వాలంటీర్ వద్ద ఉండే యాప్‌తో సరి చూసుకోవాల్సి ఉంటుంది. అందులో వివరాలు తప్పుగా ఉంటే వాలంటీర్ యాప్ హెచ్ హెచ్ మ్యాపింగ్ ద్వారా ఈకేవైసీ అప్ డేట్ చేసి.. సరిచేయాల్సి ఉంటుంది.
మరో ముఖ్యమైన అంశం ఏంటంటే..? హాజురు శాతం 75 కన్నా తక్కువ ఉండొద్దు. దీని ప్రకారం నవంబర్ 8వ తేదీ 2021 నుంచి ఏప్రిల్ 30 2022 వరకు పరిగణలోకి తీసుకుంటారు. విద్యార్థుల హాజరు శాతంతో పాటు.. ప్రతీ నెల 300 యూనిట్ల విద్యుత్ బిల్ మించరాదని తెలిపింది. మరోవైపు కొత్త జిల్లాలను విద్యార్థులు ఆధార్ అడ్రస్‌లో అప్ డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
అమ్మ ఒడికి అర్హతలివీ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ స్థానికులై ఉండాలి, తల్లిదండ్రులు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు కలిగి ఉండాలి. ప్రయివేటు లేదా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 75 శాతం హాజరు కలిగి ఉండాలి. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారైతే నెలకు 5 వేల లోపు ఉండాలి. పట్టణవాసులైతే నెలకు రూ. 6,250 మించరాదు.
పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలకూ ఈ పథకం వర్తిస్తుంది. జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా ఇచ్చే రూ. 15 వేలల్లో ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయలను పాఠశాలల్లో మరుగు దొడ్ల నిర్వహణ కోసం వెచ్చిస్తోంది. అంటే 14 వేలు మాత్రమే తల్లి ఖాతాలో జమ చేస్తుంది. ఈ వెయ్యి రూపాయలను టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్‌లో జమ చేస్తుంది.