ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు.
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఆయనకు రాఖీ కట్టారు.
డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, విడదల రజిని, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, కళావతి, నాగులాపల్లి ధనలక్ష్మి జగన్ కు రక్షాబంధన్ కట్టారు.
సీఎం జగన్ కు స్వీట్ తినిపిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
మహిళా నేతలతో సీఎం జగన్ సెల్ఫీ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తన స్వగృహంలో రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.
మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చంద్రబాబుకు రాఖీలు కట్టారు.
...