CM Jagan Birth Day: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వాడవాడలా జగన్ మోహన్ రెడ్డిగారి పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున జరుపుకున్నారు. ఈ సందర్భంగా, కేకులు కట్ చేయడంతోపాటు, పుస్తకాల పంపిణీ, దుస్తులు పంపిణీ, రక్తదానం, మొక్కలు నాటడం, అన్నదాన కార్యక్రమాలు.. ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
అలాగే అధినేత పుట్టిన రోజు జగన్ గారి బర్త్ డే వేడుకలతో రాష్ట్రమంతా ఎటుచూసినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాలు, బ్యానర్లు, ఫెక్సీలతో నిండిపోయింది. ఈ వేడుకల్లో ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, విద్యార్దులు, యువత పెద్దఎత్తున పాల్గొన్నారు. హ్యాపీ బర్త్ డే సీఎం జగనన్న.. అంటూ ఊరూవాడా ఏకమై నినదించాయి.
మరోవైపు జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్రైస్తవ, ముస్లిం, హిందూ, సిక్కు మతాలకు సంబంధించిన మత పెద్దలు జగన్ కు ఆశీస్సులు అందచేస్తూ, ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల హర్షాతిరేకాల నడుమ పార్టీ జెండా రంగులను పోలిన బెలూన్లను ఆకాశంలోకి ఎగురవేశారు.
రాష్ర్టంలో కొందరు నాయకుల్లా దబాయించడం, తమను ఎన్నుకోకపోతే రాష్ర్టం నష్టం పోతుందని బెదిరించడం ఇవేమీ జగన్ కు అలవాటు లేదన్నారు. తాము ప్రభుత్వం ద్వారా చేస్తున్న సేవ, తమ పార్టీ నేతలు చేస్తున్న సేవ నచ్చితేనే దీవించమని అడుగుతున్నారు. ఇదే నిజమైన రాజకీయనాయకుడికి కావాల్సిన లక్షణం, ప్రజానేతకు కావాల్సిన లక్షణం అని అన్నారు.
రాష్ర్ట మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ కు నేడు తెలుగు ప్రజలందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారన్నారు. జగన్ నిండునూరేళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటున్నానని అన్నారు. దేవుడి తోపాటు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి దీవెనలు మనందరిపై మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను అన్నారు.
తెలుగు అకాడమి ఛైర్ పర్సన్ శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా పేదవర్గాలందరూ చేసుకునే గొప్ప పండుగ శ్రీ వైయస్ జగన్ జన్మదినం అని అన్నారు. 30 సంత్సరాలపాటు రాష్ర్ట ముఖ్యమంత్రిగా చల్లగా పరిపాలించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రజల ఆశీస్సులు శ్రీ వైయస్ జగన్ కు ఎప్పుడూ ఉంటాయన్నారు.
మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... జగన్ పుట్టినరోజు అందరికీ చాలా సంతోషకరమైన రోజు అని అన్నారు. సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరూ, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ ప్రభుత్వంలో భాగమని కోట్లాది మంది భావిస్తున్నారని తెలిపారు. కళ్లుండి చూడలేని కబోదులు ఎవరైనా విమర్శలు చేయవచ్చుగాని.. 80 శాతం మంది ప్రజలు మెచ్చే నాయకుడు జగన్ గారు అని అన్నారు.