ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా (MLA Roja) కు ప్రత్యేక స్థానముంది. చిత్తూరు జిల్లా (Chittoor District) నగరి నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా.. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడుతుంటారు. సొంతపార్టీలో అసమ్మతివర్గాన్ని కూడా ఆమె అదే స్థాయిలో ఎదుర్కొంటున్నారు.
ఇప్పుడు ఏ పార్టీ ప్రమేయం లేకుండానే వ్యక్తిగతంగా నగరి వెళ్లిన వాణి విశ్వనాథ్.. నగరిలో పోటీ చేస్తానని ప్రకటించారు. ఐతే అక్కడ రోజాకు సొంతపార్టీ నుంచే అసమ్మతి ఎదురవుతుండగా.. కొత్తగా మరో ప్రత్యర్థి వచ్చి చేరారు. వచ్చే ఎన్నికల్లోగా వాణీ విశ్వనాథ్ ఏదొక పార్టీలో చేరి నగరిలో పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.