ఆంధ్రప్రదేశ్ లో వజ్రాల గనుల తవ్వకాలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కడప జిల్లా ఉప్పరపల్లెలలో వజ్రాల వేటకు టెండర్లు పిలిచేందుకు మైనింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పరపల్లె ప్రాంతంలో వజ్రాల గనులున్నట్లు ఇటీవల జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. సంబంధిత నివేదికను రాష్ట్రప్రభుత్వానికి కూడా ఇచ్చింది. (ప్రతీకాత్మకచిత్రం)
దీంతో ఉప్పరపల్లెలో వజ్రాల మైనింగ్ కు లైన్ క్లియర్ అయింది. నిజానికి మైనింగ్ శాఖ గతంలోనే అక్కడ వజ్రాల లభ్యత ఉన్నట్లు గుర్తించింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు, వజ్రాల వెలికితీత కష్టతరం కావడంతో భారీగా ఖఱ్చయ్యే అవకాశముండటంతో పెద్దగా పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం చట్టసవరణ చేయడంతో వజ్రాల వెలికితీసేందుకు మరింత అవకాశం ఏర్పిడింది. (ప్రతీకాత్మకచిత్రం)
వజ్రాల కోసం లోతుగా అన్వేషించేందుకు టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేసింది. ఈ గనికి వేలం నిర్వించి కాంపోజిట్ లీజ్ ఇవ్వనున్నారు. లీజుకు తీసుకున్న సంస్థల వెంటనే మైనింగ్ చేసుకునే వీలు మాత్రం ఉండదు. ఆ బ్లాకుల్లో వజ్రాలు ఎక్కడున్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి సొంతగా జీ-3, జీ-2, జీ-1 సర్వేలు చేయించుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మకచిత్రం)