బుధవారం అనగా 11-05-2022న జరగాల్సిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. రేపు జరగాల్సిన పరీక్షను ఈనెల 25న నిర్వహిస్తామని తెలిపింది. తుఫాన్ కారణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జామ్స్ కంట్రోల్ ఆఫీసర్ పేర్కొన్నారు.
ఈనెల 11వ తేదీకి సంబంధించిన పరీక్ష మాత్రమే వాయిదా పడిందని..12వ తేదీ నుంచి యథావిథిగా పరీక్షలు జరుగుతాయని అందులో ఎలాంటి మార్పులు లేవని అధికారులు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆర్ఐఓలు, సీఎస్, డీవోలతో పాటు ఇన్విజిలేటర్లు కూడా ఈ విషయాన్ని గమనించాలని ఇంటర్ బోర్డు తెలిపింది. (ప్రతీకాత్మకచిత్రం)