2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. అసలే రెవెన్యూ లోటు.. ఆపై కరోనా కష్టకాలం కొనసాగుతున్న తరుణంలో ఏపీ బడ్జెట్ ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. (ఫ్రతీకాత్మక చిత్రం )
2/ 6
కరోనా కష్టకాలంలో బడ్జెట్ రూపకల్పన అధికారులకు కత్తి మీద సాములా మారిందనే చర్చ జరుగుతోంది. (ఫ్రతీకాత్మక చిత్రం )
3/ 6
ఈసారి బడ్జెట్ రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.38 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. (ఫ్రతీకాత్మక చిత్రం )
4/ 6
గతేడాది అనుభవాలతో ఆదాయ, వ్యయాలకు సంబంధించిన అంచనాలను ఆర్థికశాఖ రూపొందిస్తోంది. గతేడాది బడ్జెట్లో అంచనా వేసిన విధంగా ఆదాయాన్ని ఏపీ ప్రభుత్వం అందుకోలేకపోయింది. (ఫ్రతీకాత్మక చిత్రం )
5/ 6
గతేడాది సుమారు రూ. 1.82 లక్షల కోట్ల వ్యయం కాగా, ఆదాయం మాత్రం కేవలం 77, 560 కోట్లు మాత్రమే అని తెలుస్తోంది. (ఫ్రతీకాత్మక చిత్రం )
6/ 6
గతేడాది రూ. లక్ష కోట్లకు పైగా బడ్జెట్ లోటు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఏడాది బడ్జెట్ ఎలా ఉంటుందన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. (ఫ్రతీకాత్మక చిత్రం )