ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలు (AP Welfare Schemes) అమలవుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు వివిధ పథకాల పేరిట ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోంది. వీటిలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాపునేస్తం (YSR Kapu Nestham), వైఎస్ఆర్ చేయూత (YSR Cheyutha), ఈబీసీ నేస్తం (YSR EBC Nestham) తో పాటు డ్వాక్రా రుణాల ద్వారా మహిళలు ఆర్ధికంగా ఎదిగేందుకు పథకాలను అమలు చేస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఈ పథకం ద్వారా ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేసే స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం రుణసాయం అందించనుంది. ఆగస్టు నెలాఖరులోగా రాష్ట్రంలో కొత్త యూనిట్ల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. కొత్త యూనిట్ల కోసం డీపీఆర్ ను ఇప్పటికే బ్యాంకులకు పంపింది. ఇప్పటికే కొనసాగుతన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్లకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు రుణసదుపాయం కల్పిస్తారు. అంతేకాదు ఈ పరిశ్రమలకు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సాంకేతిక సహకారం అందిస్తుంది. (ప్రతీకాత్మకచిత్రం)