రాష్ట్రంలో ఐసీఎంఆర్ గుర్తింపు ఉన ఎన్ఏబీఎల్ ప్రైవేట్ ల్యాబుల్లో ఆర్టీపీసీఆర్ టెస్టుల ధరను రూ.350గా నిర్ణయించింది. టెస్టులు నిర్వహించే ఆస్పత్రులు, ల్యాబుల్లో కచ్చితంగా కొత్త ధరలను ప్రదర్శించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా వైద్యాధికారులు నూతన ధరలు అమలవుతున్నాయా లేదా అనేదానిని పర్యవేక్షించాలని ఆదేశించింది.
గతంలో రాష్ట్రంలో కరోనా టెస్టు ధర రూ.499గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్ట్ కు రూ.475 వసూలు చేసేవారు. అలాగే NABL ల్యాబుల్లో రూ.475 వసూలు చేసేవారు. ప్రస్తుతం ధరలు తగ్గించడంతో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు సొంతగా టెస్టులు చేయించుకునే అవకాశముంటుందని ప్రభుత్వం భావిస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి రోజూ 40వేలకు పైగా కరోనా టెస్టులు చేస్తుండగా పాజిటివిటీ రేటు 18శాతానికి పైగా ఉంది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ పై దృష్టిపెడుతున్న ప్రభుత్వం టెస్టులను రెట్టింపు చేయాలని చూస్తోంది. రానున్న రోజుల్లో రోజుకు లక్ష టెస్టులు చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)