జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైన విద్యార్థులకు ప్రతి విద్యాసంవత్సరంలో నాలుగు విడతలుగా పూర్తి ఫీజురీయింబర్స్ అందిస్తోంది. ఇప్పటివరకు రూ.6,259 కోట్లను ప్రభుత్వం విద్యార్థులకు అందజేసింది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఈ విద్యాసంవత్సరంలో 2021 ఏప్రిల్ 19న మొదటి విడత నగదు విడుదలచేసిన ప్రభుత్వం.. జూలై 29న రెండో విడత మొత్తాన్ని ఖాతాల్లో వేసింది. నవంబ్ 3వ తేదీన నాలుగో విడత నగదు విద్యార్థలకు అందాయి. తాజాగా మార్చి 8న నాలుగో విడత నగదు జమ చేసేందుకు ఏర్పాట్లు చేయగా.. మహిళా దినోత్సవం సందర్భంగా వాయిదా పడింది. (ప్రతీకాత్మకచిత్రం)