సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ (RRR Movie). రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) హీరోలగా రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్లో వస్తున్న ఈ హై బడ్జెట్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా వేలాది థియేటర్లలో సందడి చేయనుంది. (RRR movie Photo : Twitter)
ఇదిలా ఉంటే ఏపీలో సినిమా టికెట్ ధరలను పెంచుతూ మార్చి 7వ తేదిన ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. థియేటర్ల నిర్వహణ, టికెట్ ధరను గరిష్ఠంగా రూ.250, కనిష్ఠంగా రూ.20గా నిర్ణయించింది. మున్సిపాల్ కార్పొరేషన్లోని నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం- ప్రీమియం ధరలు రూ.40-రూ.60గా ఉండగా, ఏసీ థియేటర్లలో రూ.70-రూ.100గా, స్పెషల్ థియేటర్లలో రూ.100-రూ.120గా, మల్టీపెక్స్లో రూ.150- రూ.250గా నిర్ణయించింది. మున్సిపాలిటిల్లో నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం- ప్రీమియం ధరలు రూ.30-రూ.50గా, ఏసీ థియేటర్లలో రూ.60-రూ.80గా, స్పెషల్ థియేటర్లలో రూ.80-రూ.100గా, మల్టీపెక్స్లో రూ.125-రూ.250గా నిర్ణయించింది.