Ap Employees: ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ ఉగాది కానుక..రాష్ట్రంలో ఎక్కడైనా..
Ap Employees: ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ ఉగాది కానుక..రాష్ట్రంలో ఎక్కడైనా..
Ap Employees: ఉగాది పర్వదినాన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ప్రాజెక్టుల్లో భాగంగా ఎక్కడైనా ప్లాట్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గతంలో ఉన్న నిబంధనలను మారుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
Ap Employees: ఉగాది పర్వదినాన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ప్రాజెక్టుల్లో భాగంగా ఎక్కడైనా ప్లాట్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
2/ 9
ఈ మేరకు గతంలో ఉన్న నిబంధనలను మారుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో కేవలం ఉద్యోగులు పని చేస్తున్న ప్రాంతంలో ఉన్న జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల్లో మాత్రమే ప్లాట్ కొనుగోలు చేసే అవకాశం ఉండేది.
3/ 9
కానీ కొన్నిరోజులుగా ఉద్యోగుల విజ్ఞప్తితో నిబంధనలను సడలించి జీవో నెంబర్ 38 జారీ చేశారు.
4/ 9
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో ఎక్కడ పని చేసే వారైనా తమకు ఇష్టమున్న చోట ప్లాట్ తీసుకోవచ్చు. అలాగే ధరల్లో 20 శాతం రిబేట్ సౌకర్యం కూడా ఉంది.
5/ 9
ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఉన్న 22 నగరాలూ, పట్టణాల్లో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.
6/ 9
ఇక ఈ ప్లాట్లు మార్కెట్ ధర కంటే తక్కువకే అందుబాటులో ఉంటాయి. ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది.
7/ 9
రాష్ట్రంలో ఉన్న అన్ని లే అవుట్లలో కూడా 20 ప్లాట్లు రిజర్వ్ చేయడంతో పాటు ధరలో కూడా 20 శాతం రిబేట్ అవకాశం ఉంటుంది.
8/ 9
తాజాగా రిలీజ్ అయిన జీవోతో రాష్ట్రంలో ఎక్కడ పని చేసే వారైనా తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవచ్చు.
9/ 9
ఇక లే అవుట్స్ వివరాలను..https: //migapdptcp.ap.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చని ప్రభుత్వం పేర్కొంది.