ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు వేసవి సెలవులిచ్చిన ప్రభుత్వం.. టీచర్లకు మాత్రం షాకిచ్చింది. ఉపాధ్యాయులకు సెలవులను రద్దు చేసింది. మే 20వ తేదీ వరకు సెలవులను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చింది. మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే సెలవులు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. (ప్రతీకాత్మకచిత్రం)
మరోవైపు రాష్ట్రంలోని స్కూళ్లకు మే 6వ తేదీ నుంచి జూలై 3వరకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలిచ్చిన సంగతి తెలసిసిందే. జూన్ 14కు బదులు జులై 4 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. విద్యార్థులకు మాత్రం మే 5 నుంచి సెలవులిచ్చిన ప్రభుత్వం ఉపాధ్యాయులకు మాత్రం మే 20 తర్వాతే వర్తిస్తాయి.
ఈ 15 రోజుల పాటు ఉపాధ్యాయులకు విధులను కూడా నిర్దేశించింది ప్రభుత్వం. పరీక్షలకు సంబందించిన ప్రశ్నాపత్రాల మూల్యాంకనం, మార్క్ షీట్స్ అప్ లోడ్ చేయడం, మెరిట్ లిస్ట్ సిద్ధం చేయడం, నాడునేడు పనులను పర్యవేక్షించడం వంటి విధులను కేటాయించింది. అలాగే వచ్చే విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు తీసుకునే పనులను అప్పజెప్పింది.
ఏపీ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సమ్మర్ హాలిడేస్ ప్రకటించింది. మే 4వ తేదీ నాటికి అన్ని తరగతుల పరీక్షలు పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. జులై 4వ తేదీన పాఠశాలలను తిరిగి పునఃప్రారంభిస్తామని ప్రభుత్వం తెలిపింది. (ప్రతీకాత్మకచిత్రం)