పోలవరం రూపంలో కేంద్రంతో మరో ఘర్షణ తప్పదా? జగన్ ప్రభుత్వ వ్యూహమేంటి?

Polavaram : ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు కేంద్రంతో ఘర్షణకు తావిస్తున్నాయి. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్ష (పీపీఏల) విషయంలో కేంద్రంతో ఘర్షణ కొనసాగుతున్న తరుణంలో పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ రూపంలో మరో వివాదం అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పీపీఏల తరహాలోనే పోలవరంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ముందునుంచీ ఆరోపిస్తోంది. అందువల్ల ఈ వ్యవహారంలో జగన్ ప్రభుత్వం తదుపరి చర్యలు ఆసక్తి రేపుతున్నాయి.