పీఆర్సీ (AP PRC Issue) విషయంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వార్ కొనసాగుతోంది. ఓ వైపు పీఆర్సీకి వ్యతిరేకంగా సమ్మెనోటీసులిచ్చేందుకు ఉద్యోగులు సిద్ధమవుతుండగా.. ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేదేలేంటోంది. రాష్ట్ర కేబినెట్ కూడా పీఆర్సీని ఆమోదించడంతో దాని ప్రకారమే జీతాలు చెల్లించేందుకు సిద్ధమైంది. (సీఎం జగన్ పైల్)
కొత్త పీఆర్సీ ప్రకారం జూలై1, 2018 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు సర్వీస్ లెక్కించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే కొత్త సాఫ్ట్ వేర్ మాడ్యూల్ లో బిల్లులు అప్ లోడ్ చేయాలని.. ఈ ప్రక్రియను ఎల్లుండిలోగా పూర్తి చేయాలని ఆయా శాఖలకు సూచించింది. అలాగే కొత్త పేరోల్స్ అందుబాటులో ఉంచాలని డీడీవోలను ఆదేశించింది. (ఫైల్)