ఏపీలో ఈ నెల 16 నుంచి విద్యాసంస్థలు తెరవాలని గతంలో నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేసుకుంటోంది. 16 నుంచే పాఠశాలలను పున:ప్రారంభిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. (ఫ్రతీకాత్మక చిత్రం)
2/ 6
సాధారణ పని వేళల్లోనే పాఠశాలలు నడుస్తాయని తెలిపారు. కోవిడ్ నిబంధనలపై జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.(ఫ్రతీకాత్మక చిత్రం)
3/ 6
95 శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని.. మిగిలినవారికి కూడా టీకాలు వేయాలని ఆదేశించామని తెలిపారు.(ఫ్రతీకాత్మక చిత్రం)
4/ 6
రాష్ట్రంలో ఎక్కడా ఆన్లైన్ తరగతులు జరగడం లేదని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు వద్దని ఆదేశించామని స్పష్టం చేశారు.(ఫ్రతీకాత్మక చిత్రం)
5/ 6
మరోవైపు జాతీయ విద్యావిధానం సంస్కరణలపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది.(ఫ్రతీకాత్మక చిత్రం)
6/ 6
ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త విద్యావిధానం అమలు అంశంపై చర్చించారు. ఇకపై 5+3+4 విధానంలో విద్యా బోధన ఉండబోతోందని మంత్రి సురేశ్ తెలిపారు.(ఫ్రతీకాత్మక చిత్రం)