తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్ లో.. గత 24 గంటల్లో 11వేల 573 కరోనా కేసులు నమోదయినట్టు పేర్కొన్నారు. అలాగే కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. సాధారణంగా 11 వేలకు పైగా కేసులు అంటే డేంజర్ బెల్స్ ఉన్నట్టే చెప్పాలి.. కానీ గత వారం రోజులతో పోల్చుకుంటే కేసుల సంఖ్య తగ్గిందనే చెప్పాలి.. మొన్నటి వరకు దాదాపు 15 వేల మార్కుకు కేసులు చేరాయి. ఇప్పుడు 11 వేలకు తగ్గాయి..