ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ క్షణం విద్యార్థిగా మారిపోయారు. జగనన్న విద్యాకానుక పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఫొటోలను చూస్తే జగన్‌లో స్టూడెంట్ కనిపిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ క్షణం విద్యార్థిగా మారిపోయారు. జగనన్న విద్యాకానుక పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఫొటోలను చూస్తే జగన్‌లో స్టూడెంట్ కనిపిస్తారు.
2/ 11
తెల్ల చొక్కా వేసుకుని, జేబులో పెన్ను పెట్టుకుని, భుజానికి బ్యాగ్ తగిలించుకుని ఎంచక్కా స్కూలుకు వెళ్లే పిల్లాడిలాగా కనిపించారు సీఎం జగన్. భుజానికి బ్యాగ్ తగిలించుకున్న ఫొటో చూస్తే ఆయన ముఖానికి పెట్టుకున్న మాస్క్ వెనుక చిరునవ్వు కనిపిస్తోంది.
3/ 11
కేవలం బ్యాగ్ వేసుకుని ముచ్చట తీర్చుకోవడమే కాదు. కొద్దిసేపు క్లాసులో కూర్చున్నారు కూడా. పిల్లలతో కలసి క్లాసులో కూర్చుని వారితో సరదాగా గడిపారు.
4/ 11
ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలని సీఎం జగన్ అన్నారు. చదువే విద్యార్థులకు ఒక శక్తి అని తెలిపారు. జగనన్న విద్యా కానుక పథకాన్ని ఆయన నేడు ప్రారంభించారు.
5/ 11
జగనన్న విద్యాకానుక కిట్లలో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ ఉంటాయి.
6/ 11
బాలురకు స్కై బ్లూ రంగు, బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందించారు. కోవిడ్ నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు కూడా పంపిణీ చేశారు.
7/ 11
యూనిఫామ్ కుట్టించుకునేందుకు మూడు జతలకి రూ.120 చొప్పున తల్లుల అకౌంట్‌కే నేరుగా జమ చేస్తున్నారు.
8/ 11
జగనన్న విద్యాకానుక పథకానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 91212 96051, 91212 96052 హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.
9/ 11
ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉందని ఈ సందర్భంగా సీఎం జగన్ అన్నారు. స్కూళ్లలో డ్రాప్ అవుట్స్‌పై గత ప్రభుత్వం ఆలోచించలేదని అన్నారు. పేదలకు మంచి విద్యాప్రమాణాలు అందించాలనే అంగన్వాడి నుంచి ఉన్నతవిద్య వరకు విప్లవాత్మక మార్పులు చేపట్టామని అన్నారు.
10/ 11
నాడు -నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లల్లో రూపురేఖలు మారుస్తున్నాం. బడికి వెళ్లే పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు గోరుముద్ద పథకం తీసుకొచ్చామని... పేద పిల్లలు గొప్పగా చదవాలనే ఉద్దేశ్యంతో ఒకటి నంచి టెన్త్ వరకు ప్రతి విద్యార్థికి విద్యాకానుక అందిస్తున్నామని అన్నారు.
11/ 11
నవంబర్ 2 లోగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 44.32 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందిస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.650 కోట్ల ఖర్చుతో విద్యాకానుకను అందిస్తున్నామని తెలపారు.